Rahul Gandhi: రాహుల్ గాంధీకి కొత్త బంగ్లాను ఆఫర్ చేసిన లోక్ సభ హౌస్ కమిటీ

Lok Sabha House Committee offers Rahul Gandhi new residence

  • సునేహ్రి బాగ్ రోడ్డులో బంగ్లా నెంబర్ 5ని ఆఫర్ చేసిన కమిటీ!
  • ఈ ఇంటికి సంబంధించి రాహుల్ గాంధీ నుంచి సమాధానం రావాల్సి ఉంది
  • రాహుల్ గాంధీ టైప్ 8 బంగ్లాకు అర్హులు

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించనుంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ ఆయనకు ఆఫర్ చేసినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీ ఈ భవనాన్ని చూసేందుకు వచ్చారు. దీంతో ఆయనకు ఈ భవనం కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఇంటికి సంబంధించి రాహుల్ గాంధీ నుంచి సమాధానం రావాల్సి ఉందని తెలుస్తోంది.

లోక్ సభలో ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి కేబినెట్ ర్యాంక్ కలిగి ఉన్నారు. ఆయన టైప్ 8 బంగ్లాకు అర్హులు. టైప్ 8 బంగ్లాను కేబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.

More Telugu News