Ravi Shastri: గంభీర్ గోల గోల చేసే రకం కాదు: రవిశాస్త్రి

Ravi Shastri comments on Team India new coach Gautam Gambhir

  • టీమిండియా కొత్త కోచ్ గా గంభీర్ నియామకం
  • శ్రీలంక పర్యటనతో కోచ్ గా ప్రస్థానం ప్రారంభిస్తున్న గంభీర్
  • గంభీర్ ఫ్రెష్ ఐడియాలతో జట్టును నడిపిస్తాడని ఆశిస్తున్నట్టు శాస్త్రి వెల్లడి

టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ గురించి అందరికీ తెలిసిందేనని, గోల గోల చేసే రకం కాదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే రకం అని వెల్లడించారు. 

గంభీర్ సరైన వయసులో టీమిండియా కోచ్ గా వచ్చాడని అభిప్రాయపడ్డారు. ఫ్రెష్ ఐడియాలతో టీమిండియాను నడిపిస్తాడని, గంభీర్ సామర్థ్యం ఏంటో ఇటీవల ఐపీఎల్ సీజన్ లో చూశామని రవిశాస్త్రి పేర్కొన్నారు. పరిణతి చెందిన ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు కోచ్ గా వ్యవహరిస్తుండడం కలిసొచ్చే అంశమని అన్నారు. 

ఆటగాళ్లందరూ తమ తమ స్థానాల్లో కుదురుకున్నారని, అలాంటి జట్టును తన తాజా ఆలోచనలతో గంభీర్ విజయవంతంగా నడిపిస్తాడని ఆశిస్తున్నానని తెలిపారు. 

రేపటి నుంచి టీమిండియా-శ్రీలంక మధ్య టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో, రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ గా బరిలో  దిగుతోంది.

More Telugu News