Mohammad Shami: పేసర్ మహ్మద్ షమీ డైట్‌ సీక్రెట్ బయటపెట్టిన అతడి స్నేహితుడు

Mohammad Shami friend Umesh Kumar opened up on the Bowlers diet and his love for mutton

  • రోజుకు ఒక కేజీ మటన్ తినకుండా షమీ ఉండలేడన్న స్నేహితుడు ఉమేష్ కుమార్
  • కేవలం ఒక రోజు మాత్రమే ఉండగలడని వెల్లడి
  • మటన్ తినకుంటే షమీ బౌలింగ్ వేగంగా గంటకు 15 కిమీ మేర తగ్గుతుందని వ్యాఖ్య

మడమ గాయానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకొని.. తిరిగి భారత్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా సన్నాహాలు మొదలు పెట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ అనుసరించే ఆహారపు అలవాట్లపై (డైట్) అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ స్పందించాడు. 

మటన్‌ అంటే షమీకి అమితమైన ఇష్టమని, షమీ దేన్నైనా భరించగలడు, కానీ మటన్ లేకుండా ఉండలేడని ఉమేష్ కుమార్ వెల్లడించాడు. మటన్ లేకుండా ఒక్క రోజు మాత్రమే ఉండగలడని, రెండవ రోజు కూడా మటన్ లేకుంటే ఇబ్బందిగా భావిస్తాడని, ఇక మూడవ రోజు కూడా మటన్ తినకపోతే పిచ్చివాడిలా చేస్తాడని అన్నాడు. షమీ రోజుకు 1 కేజీ మటన్ తింటాడని, ప్రతిరోజూ మటన్ తినకుంటే అతడి బౌలింగ్ వేగం గంటకు 15 కిమీ మేర తగ్గుతుందని ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కాగా మహ్మద్ షమీ గాయం కారణంగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన షమీ.. ఆ తర్వాత ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు దూరమైన విషయం తెలిసిందే.

కాగా షమీ ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ సమయానికి షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News