Raj Tarun: కోట్ల ఆస్తులను పక్కన పెట్టేసే 'పురుషోత్తముడు'

Purushotthamudu Movie Update

  • రాజ్ తరుణ్ హీరోగా చేసిన 'పురుషోత్తముడు'
  • కథానాయికగా హాసిని సుధీర్ పరిచయం 
  • ప్రధానమైన బలంగా కనిపిస్తున్న తారాగణం 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా గోపీసుందర్ సంగీతం


రాజ్ తరుణ్ కి హీరోగా ఈ మధ్య కాలంలో హిట్ పడలేదు. సరైన కంటెంట్ ప్రేక్షకుల ముందుకురావాలనే ఉద్దేశంతో అతను కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఆ తరువాత కథపై నమ్మకంతో ఆయన ఒప్పుకున్న సినిమానే 'పురుషోత్తముడు'. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి భిన్నంగా సెట్ చేసిన టైటిల్ గా ఇది కనిపిస్తుంది. రమేశ్ తేజావత్ - ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాకి రామ్ భీమన దర్శకత్వం వహించాడు.

హాసిని సుధీర్ కథానాయికగా పరిచయమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఇది చిన్న సినిమాగా భావించిన చాలామంది, పోస్టర్స్ పై సీనియర్ స్టార్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. మురళీశర్మ .. బ్రహ్మానందం వంటి బలమైన తారాగణం ఈ సినిమాలో కనిపిస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా గోపీసుందర్ కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నవారే. 

కథలోకి వెళితే .. రామ్ (రాజ్ తరుణ్) విదేశాలలో చదువు పూర్తిచేసుకుని ఇండియాకి తిరిగొస్తాడు. అతనిని తన సంస్థకి సీఈఓగా నియమించాలని తండ్రి (మురళీశర్మ) భావిస్తాడు. అయితే మరో షేర్ హోల్డర్ అయిన వసు (రమ్యకృష్ణ) అందుకు అభ్యంతరం తెలియజేస్తుంది. రామ్ ఒక సామాన్యుడిలా 100 రోజుల జీవితాన్ని చూస్తే అందుకు అంగీకరిస్తానని అంటుంది. అందుకు ఒప్పుకున్న రామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది కథ. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉందనీ, నటనతో రాజ్ తరుణ్ .. గ్లామర్ తో హీరోయిన్ ఆకట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఫైనల్ గా ఎలాంటి రిజల్టును రాబడుతుందో. 

More Telugu News