Kodandaram: ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కోదండరాం తీవ్ర ఆగ్రహం

Kodandaram fires at Smitha Sabharwal

  • దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించిన కోదండరాం
  • కొన్ని ఉద్యోగాలకు పనికిరారన్న స్మిత వ్యాఖ్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్య
  • వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం దారుణమన్న కోదండరాం

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను కోదండరాం ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికి రారన్న ఆమె వ్యాఖ్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం దారుణమన్నారు.

చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపరచడం సరికాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించకపోగా... ఇంకా వాటిని సమర్థించుకోవడం దారుణమని స్మితా సబర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు రాకుండా ప్రభుత్వం చూడాలన్నారు.

Kodandaram
Smita Sabharwal
Congress
Telangana
  • Loading...

More Telugu News