Jupalli Krishna Rao: కేసీఆర్ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు: జూపల్లి కృష్ణారావు

Jupalli Krishna Rao fires at KCR

  • దొంగే... దొంగ దొంగ అని అరిచినట్లుగా కేసీఆర్, హరీశ్ రావుల తీరు ఉందని విమర్శ
  • పదేళ్లలో కేసీఆర్ తెచ్చిన అఫ్పులకు భారీ వడ్డీలు కడుతున్నామన్న జూపల్లి
  • కేసీఆర్ పదేళ్ల కాలంలో ఎప్పుడూ వాస్తవిక బడ్జెట్‌ను పెట్టలేదని విమర్శ

రైతులు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని, కానీ మాజీ సీఎం కేసీఆర్ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తన మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగే... దొంగ దొంగ అని అరిచినట్లుగా కేసీఆర్, హరీశ్ రావుల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

పదేళ్లలో కేసీఆర్ తెచ్చిన అఫ్పులకు భారీ వడ్డీలు కడుతున్నామన్నారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో ఎప్పుడూ వాస్తవిక బడ్జెట్‌ను పెట్టలేదన్నారు. తాము మోసం చేయకుండా, వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తే అంతే ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు ఎత్తేసినట్లుగా కేసీఆర్ మాట్లాడటం విడ్డూరమన్నారు. గతంలో ఇచ్చిన దానికి ఎక్కడా తగ్గించి ఇవ్వలేదన్నారు. గతంలో బీఆర్ఎస్ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనుకున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి 25 శాతం కేటాయింపులు జరిపామన్నారు.

Jupalli Krishna Rao
Telangana
KCR
BRS
  • Loading...

More Telugu News