KTR: ఆగస్ట్ 2 లోపు కాళేశ్వరం పంపింగ్ స్టార్ట్ చేయకుంటే...!: కేటీఆర్

KTR ultimatum to Revanth Reddy government

  • రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్న కేటీఆర్ 
  • కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులను ఆన్‌ చేయడం లేదని ఆరోపణ
  • కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని వ్యాఖ్య 

ఆగస్ట్ 2వ తేదీలోపు కాళేశ్వరం పంపింగ్ స్టార్ట్ చేయకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంపులను స్టార్ట్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం వారు బీఆర్ఎస్ ప్రతినిధులు కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులను ఆన్‌ చేయడం లేదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అన్నారు. కానీ ప్రస్తుతం పంటల సాగుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గతంలో నీటి సమస్య లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీరు నింపాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలోపు పంప్ హౌస్‌ను ప్రారంభించాలని అల్టిమేటం జారీ చేశారు.

అగస్ట్ 2 లోపు జలాశయాల్లో నీటిని నింపాలన్నారు. గోదావరిలో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదన్నారు. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పంప్ హౌస్ ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజినీర్లు చెప్పారన్నారు.

  • Loading...

More Telugu News