Committee Kurrollu: గ్రామీణ నేపథ్యంలో ‘కమిటీ కుర్రోళ్లు’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

Committee Kurrollu Trailer Out


నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయికుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 9న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి ఈ కథ పల్లెటూరు చుట్టూ తిరుగుతుంది. గ్రామంలో జాతరలు, కొట్లాటలు, స్నేహితుల మధ్య మనస్పర్థలు, ఎలక్షన్లు వంటివాటి చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Committee Kurrollu
Committee KurrolluTrailer
Niharika Konidela
Yadhu Vamsi
Anudeep Dev

More Telugu News