KTR: హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి: కేటీఆర్ ఆగ్రహం

KTR fires at government over Hyderabad issue

  • సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్న కేటీఆర్
  • బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయన్న మాజీ మంత్రి
  • సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన

హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయన్నారు. డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.

చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. మేయర్‌, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతోందన్నారు. పర్యవేక్షించాల్సిన పార్ట్ టైం మున్సిపల్ మంత్రి... ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని సూచించారు.

  • Loading...

More Telugu News