AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు.. పరారీలో ఉన్న వాసుదేవరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు

AP CID searching for ABSBCL former MD D Vasudeva Reddy

  • వాసుదేవరెడ్డి కోసం గాలిస్తున్న సీఐడీ ప్రత్యేక బృందాలు
  • విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో అప్రమత్తం
  • కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, కీలక పత్రాలు చోరీ చేశారన్న అభియోగాలు

ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) గత ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 

అభియోగాలు ఇవే
విజయవాడలోని ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలు చోరీ చేశారన్న ఫిర్యాదుతో జూన్ 6న సీఐడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజే హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. అప్పటికే ఆయన పరారయ్యారు.

AP Liquor Scam
Vasudeva Reddy
APSBCL
CID
  • Loading...

More Telugu News