KCR: కాసేపట్లో తెలంగాణ బడ్జెట్... అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్

KCR arriving to TG assembly

  • ప్రతిపక్ష హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్
  • వెంట ఎమ్మెల్యేలు పల్లా, పాడి, మాగంటి
  • బడ్జెట్ ప్రవేశపెడుతున్న మల్లు భట్టివిక్రమార్క

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. అంతకుముందు నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డి ఉన్నారు.

కాసేపట్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.

KCR
Telangana
Telangana Assembly Session
  • Loading...

More Telugu News