Telangana: 2024-25 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం

Telangana Cabinet approves budget

  • బడ్జెట్ పద్దును గవర్నర్‌కు అందించనున్న ఉపముఖ్యమంత్రి
  • సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం
  • 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టివిక్రమార్క

రాష్ట్ర బడ్జెట్‌కు తెలంగాణ మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బడ్జెట్ పద్దును గవర్నర్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అందించనున్నారు. బడ్జెట్ పద్దును స్పీకర్, మండలి చైర్మన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టివిక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Telangana
Mallu Bhatti Vikramarka
Telangana Assembly Session
  • Loading...

More Telugu News