Telangana Assembly Session: ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... షెడ్యూల్ ఇదే!

Telangana assembly sessions continues till Aug 2


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జులై 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. రేపు (జులై 25) ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 26వ తేదీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 

జులై 27న బడ్జెట్ పై చర్చ చేపట్టనున్నారు. జులై 28న ఆదివారం కావడంతో అసెంబ్లీ సమావేశాలు తిరిగి సోమవారం నుంచి కొనసాగనున్నాయి. జులై 29, 30 తేదీల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

జులై 31న ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆగస్టు 1, 2 తేదీల్లోనూ రేవంత్ సర్కారు పలు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.

More Telugu News