Mega Family: లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ... ఫొటో ఇదిగో!

Mega family roams at Hyde Park in London

  • కుటుంబంతో యూరప్ పర్యటనకు వెళ్లిన చిరంజీవి
  • లండన్ లోని హైడ్ పార్క్ లో ప్రశాంత క్షణాలను ఆస్వాదించామన్న చిరంజీవి
  • పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కూడా వెళుతున్నామని వెల్లడి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా యూరప్ లో పర్యటిస్తున్నారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార లండన్ లోని ప్రఖ్యాత హైడ్ పార్కులో ఉల్లాసంగా విహరించారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు, ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కూడా హాజరవుతున్నామని వెల్లడించారు. 

"రేపు పారిస్ కు వెళ్లే క్రమంలో లండన్ లోని హైడ్ పార్కులో కుటుంబంతో, ముద్దుల మనవరాలు క్లీంకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదించాను. పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్-2024 ప్రారంభోత్సవం రారమ్మని పిలుస్తోంది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

More Telugu News