Kanguva: నెక్స్ట్ లెవెల్లో 'కంగువా' .. ఫైర్ సాంగ్ రిలీజ్!

Kanguva Fire Song Released

  • సూర్య కథానాయకుడిగా 'కంగువ'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సూర్య 
  • హైలైట్ గా నిలవనున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
  • అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా రిలీజ్


కోలీవుడ్ స్టార్ హీరోల్లో సూర్యకి ఒక ప్రత్యేకత ఉంది. కమల్ .. విక్రమ్ తరువాత కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే హీరోగా ఆయన కనిపిస్తాడు. ప్రయోగాలు చేయడానికి సాహసించే హీరోగా అభిమానులు ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సూర్య నుంచి ఆయన తాజా చిత్రంగా 'కంగువ' రానుంది. 

ఈ సినిమా నుంచి సూర్య ఫస్టు పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి అంతా ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. అందుకు కారణం ఈ సినిమా కంటెంట్ చరిత్రకు సంబంధించినది. సూర్య లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. శివ దర్శకతంలో రూపొందుతున్న ఈ సినిమాను, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో  ఈ రోజున సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'ఫైర్ సాంగ్'ను రిలీజ్ చేశారు. 'ఆది జ్వాలా .. అనంత జ్వాలా' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. దసరాకి వస్తున్న ఈ సినిమా, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. 

More Telugu News