Narasapuram MPDO: నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ కథ విషాదాంతం.. ఏలూరు కాల్వలో లభ్యమైన మృతదేహం

Narasapuram MPDO Dead Body Found In Eluru Canal

  • ఈ నెల 15న అదృశ్యమైన వెంకటరమణారావు
  • పుట్టిన రోజే చనిపోయిన రోజంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్
  • వారం రోజులుగా గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
  • మధురానగర్ పై వంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహం

పుట్టిన రోజే చనిపోయే రోజంటూ మెసేజ్ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటేశ్వరరావు కథ విషాదాంతమైంది. తాజాగా ఆయన మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది. వారం రోజులుగా గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మధురానగర్ పైవంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహం కనిపించింది. ఆయన దూకిన ప్రదేశానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు.

విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో ఉండే వెంకటరమణారావు నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఆయన కానూరు వచ్చారు. 15న పని ఉందని, మచిలీపట్టణం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని, అందరూ జాగ్రత్త అని మెసేజ్ పెట్టి సెల్ ఆఫ్ చేశారు.  

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మచిలీపట్టణం, విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన వాహనం మచిలీపట్టణం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ. 54 లక్షల బకాయిలు ఉండడమే కారణమని గుర్తించారు.

More Telugu News