Ashwin Babu: సస్పెన్స్ థ్రిల్లర్ గా 'శివమ్ భజే' .. ట్రైలర్ రిలీజ్!

Shivam Bhaje Movie Trailer Released

  • అశ్విన్ బాబు హీరోగా రూపొందిన 'శివమ్ భజే'
  • కథానాయికగా దిగంగనా సూర్యవన్షి 
  • సస్పెన్స్ తో సాగే యాక్షన్ థ్రిల్లర్ 
  • ఆగస్టు 1వ తేదీన సినిమా విడుదల


మొదటి నుంచి కూడా అశ్విన్ బాబు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శివమ్ భజే' రెడీ అవుతోంది. సస్పెన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహించాడు.

కొంతసేపటిక్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపున నగరంలో మిస్టీరియస్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది పోలీస్ డిపార్టుమెంటుకు సవాలుగా మారుతుంది. 

ఈ నేపథ్యంలోనే హీరో బరిలోకి హీరో దిగుతాడు. అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ. దిగంగనా సూర్యవన్షి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్భాజ్ ఖాన్ .. మురళీశర్మ .. తులసి .. బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఆగస్టు 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

Ashwin Babu
Digangana Suryavanshi
Tulasi
Muralisharma

More Telugu News