Union Budget-2024: బంగారం కొనాలనుకునే వారికి బడ్జెట్ లో తీపి కబురు

Centre reduces customs duty on gold and silver

  • నేడు రూ.48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రకటించిన నిర్మలా సీతారామన్
  • బంగారం, వెండిపై 6 శాతానికి కస్టమ్స్ సుంకం తగ్గింపు
  • దేశీయంగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు

ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పరుచుకుంటున్న భారత్ ఇవాళ భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 

మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 4.3 శాతం ఉండొచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా చూపించారు. 

ఇక, ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ బంగారం, వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం, వెండిపై 15 నుండి  6 శాతానికి సుంకం తగ్గించిన కేంద్రం... ప్లాటినమ్ పై 6.4 శాతానికి సుంకం తగ్గిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రకటన చేసింది. 

కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

More Telugu News