Telangana: అసెంబ్లీలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయండి: స్పీకర్‌కు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విజ్ఞప్తి

MLAs letter to Speaker about seating in Assembly

  • బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు
  • అసెంబ్లీలో విడిగా కూర్చుంటామని స్పీకర్‌కు విజ్ఞప్తి
  • అధికార, ప్రతిపక్షాలకు సమాన దూరం పాటిస్తామని వెల్లడి

అసెంబ్లీలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో, అధికార పక్షం వైపు కూర్చోబోమని వారు చెబుతున్నారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు తాము సమదూరం పాటిస్తామని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సభలో తమకు విడిగా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు. గతంలో శ్రీధర్ బాబు స్పీకర్‌గా ఉన్న సమయంలో టీడీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి... రెండు పార్టీలతో సంబంధం లేకుండా కూర్చున్నారు.

More Telugu News