Rishikonda Palace: రుషికొండ ప్యాలెస్ పై సీఎం చంద్రబాబు, విష్ణుకుమార్ రాజు మధ్య ఆసక్తికర చర్చ

Funny discussion between Chandrababu and Vushnu Kumar Raju in BAC meeting

  • నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
  • రుషికొండలో రూ.25 లక్షల టాయిలెట్ ను అందరికీ చూపించాలన్న విష్ణు
  • రూ.30 కానీ, రూ.50 కానీ టికెట్ పెట్టాలని సూచన
  • రూ.50 అయితే మరీ ఎక్కువేమోనన్న చంద్రబాబు
  • తాను కూడా అంత ఖరీదైన టాయిలెట్ ను ఎప్పుడూ చూడలేదని వెల్లడి

ఇవాళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య రుషికొండ ప్యాలెస్ పై ఆసక్తికర చర్చ జరిగింది. 

రుషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనార్థం ఉంచాలని విష్ణుకుమార్ రాజు కోరారు. రూ.25 లక్షల ఖరీదైన టాయిలెట్ ను చూసే అవకాశం అందరికీ కల్పించాలని అన్నారు. రూ.30 లేదా రూ.50 ఎంట్రీ ఫీజు పెట్టాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. 

అందుకు చంద్రబాబు స్పందిస్తూ... రూ.50 అంటే మరీ ఎక్కువేమో అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను కూడా అంత ఖరీదైన టాయిలెట్ ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. 

రుషికొండ ప్యాలెస్ అక్రమ నిర్మాణాన్ని ప్రజలకు చూపించాల్సిందేని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆ ప్యాలెస్ లో ప్రతి వస్తువు ఎదుట ధర వివరాలు ప్రదర్శిస్తూ బోర్డులు పెట్టాలని అన్నారు. తద్వారా జగన్ ఎంత మేర నిధులు దుర్వినియోగం చేశాడో బహిర్గతం చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 

కాంట్రాక్టు అగ్రిమెంట్ బయటపెడితే అక్రమాలు అన్నీ బయటికి వస్తాయని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రుషికొండ ప్యాలెస్ పై చర్చ జరిగితే బాగుంటుందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

More Telugu News