Telangana: తెలంగాణలో వర్షాలు, వరదలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

CS Review on rains and floods

  • వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన
  • పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్న సీఎస్

వర్షాలు, వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, తెగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Telangana
CS shanti Kumari
Congress
  • Loading...

More Telugu News