K Kavitha: కవితపై సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు

Delhi court on kavitha chargesheet

  • జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచాలని ఆదేశాలు
  • ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశం
  • కవిత, మరో నలుగురిపై జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత మరో నలుగురిపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

K Kavitha
CBI
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News