Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • రేపు బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తం
  • 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 21 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ఆద్యంతం సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయి 80,502కి దిగజారింది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 24,509 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.34%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.15%), టాటా స్టీల్ (1.87%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.87%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-3.46%), కోటక్ బ్యాంక్ (-3.30%), ఐటీసీ (-1.75%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.94%).

  • Loading...

More Telugu News