Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదు: హరీశ్ రావు

Harish Rao on Smitha Sabharwal comments

  • సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు? అన్న స్మితా సబర్వాల్
  • స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదన్న హరీశ్ రావు
  • రుణమాఫీ కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలని విమర్శ

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్ అండ్ డీ, డెస్క్ జాబ్‌లు వారికి సరిపోతాయని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హరీశ్ రావు స్పందిస్తూ, స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని... ఆమె వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని పేర్కొన్నారు. 

ఇదిలావుంచితే ... రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారని, ఈ నిబంధనల వల్ల చాలామందికి రుణమాఫీ కావడం లేదని హరీశ్ రావు విమర్శించారు. కోతలు పెట్టేందుకు రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అంటున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదలీ చేశారని మండిపడ్డారు. ప్రస్తుత విభాగాలలోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలని సూచించారు.

Smita Sabharwal
Harish Rao
Telangana
  • Loading...

More Telugu News