YSRCP: అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు

YCP MLAs  walk out from Assembly session


ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా... జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి సభకు వచ్చారు. ఏపీలో అరాచక పాలన జరుగుతోందని, గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు. 

అనంతరం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి, అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేశారు. జగన్ తదితర ఎమ్మెల్యేలు బయటికి వచ్చేస్తున్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అటు, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ అధినేత బాటలోనే నడిచారు. సభ నుంచి వెలుపలికి వచ్చేశారు.

More Telugu News