Nagarjuna Yadav: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అరెస్ట్

YCP Leader Nagarjuna Yadav Arrested


టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును చంపుతామని మీడియా చర్చలో బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు గతరాత్రి అదుపులోకి తీసుకున్నారు. తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదుపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వివిధ అంశాలపై ఆయనను విచారించారు. నాగార్జునకు 41ఏ నోటీసులు జారీ చేస్తారని సమాచారం.

Nagarjuna Yadav
Kuppam
YSRCP
Chandrababu

More Telugu News