Raghu Rama Krishna Raju: అసెంబ్లీలో జగన్ పక్కన కూర్చున్న రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju sat beside Jagan in Assembly

  • నేటి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం
  • పక్కపక్క సీట్లలో కూర్చున్న జగన్, రఘురాజు
  • జగన్ తో ముచ్చటించిన రఘురాజు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతి రోజు తాను విమర్శలు గుప్పించే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పక్కన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూర్చున్నారు. సభ ప్రారంభానికి ముందు జగన్ తో మాట్లాడేందుకు రఘురాజు ఆయన వద్దకు వెళ్లారు. జగన్, రఘురాజు ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చోవడం ఆసక్తిని రేకెత్తించింది. జగన్, రఘురాజు మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చ జరిగింది. జగన్ చెవిలో రఘురాజు ఏదో చెప్పగా... ఆ వెంటనే జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయితే, జగన్ తో ఆర్ఆర్ఆర్ ఏం మాట్లాడారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More Telugu News