Reliance jio: సరసమైన ధరల్లో.. మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన జియో

Jio launches 3 new recharge plans

  • ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ఆఫర్లు ప్రకటన
  • ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్స్ కోరుకునే యూజర్లకు చక్కటి బెనిఫిట్స్
  • రూ.329, రూ.949, రూ.1049 ఆఫర్లు వెల్లడి

దేశంలోనే అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా ఉన్న రిలయన్స్ జియో ఇటీవలే రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. అంతేకాదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌స్క్రిప్షన్లు అందించే అనేక ప్లాన్‌లను రీచార్జ్ ప్లాన్ల జాబితా నుంచి తొలగించింది. అయితే రీచార్జ్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్స్ పొందాలనుకునే వినియోగదారులు నిరాశకు గురయ్యారు. కాలింగ్, డేటాతో పాటు పాప్యులర్ ఓటీటీ సేవలకు కూడా అవకాశం ఇస్తే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఈ తరహా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మూడు సరికొత్త రీచార్జ్ ప్లాన్లను జియో ప్రకటించింది.

వినియోగదారులకు సరసమైన ధరల్లో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. కొత్త ప్లాన్లలో ఉచిత కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ బెనిఫిట్స్‌ను అందించింది. కొత్తగా ప్రకటించిన జియో ప్లాన్లలో రూ.329, రూ.949, రూ.1049 ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రూ. 329 ప్లాన్ వివరాలు ఇవే..
రీచార్జ్ రూ.329 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్‌లో అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇక ఓటీటీ ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. పరిమిత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కావాలనుకునేవారికి మాత్రమే ఈ ప్లాన్‌ సరిపోతుంది.

రూ.949 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అపరిమిత ఉచిత కాలింగ్‌, రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ కింద డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్) సబ్‌స్క్రిప్షన్ 90 రోజులకు లభిస్తుంది. కాగా ఈ ప్లాన్‌‌లో 5జీ వెల్‌కమ్ ఆఫర్‌ వర్తిస్తుంది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ కోరుకునేవారికి ఈ ప్లాన్ అదనపు విలువను జోడిస్తుందని జియో పేర్కొంది.

రూ.1,049 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా
రూ.1,049 ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. రోజుకు 2జీబీ డేటా, ప్రతి రోజూ 100 ఉచిత ఎంఎస్ఎంలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లు సోనీలైవ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాక జియో టీవీ మొబైల్ యాప్‌‌ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఎక్కువ డేటాతో పాటు వినోదం కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ ప్లాన్ కూడా 5జీ వెల్‌కమ్ ఆఫర్‌తో వస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటుంది.

Reliance jio
Jio Offers
Jio Recharge plans
jio plans
  • Loading...

More Telugu News