Jagan: ఏపీ గవర్నర్ ను కలిసిన జగన్

Jagan met AP governor

  • విజయవాడలో రాజ్ భవన్ కు విచ్చేసిన జగన్
  • గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన
  • చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి

మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి, గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటలను జగన్ గవర్నర్ కు వివరించారు. అంతేకాదు, ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

Jagan
Governor
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News