Rahul Gandhi: ‘ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డ్’కి ఎంపికైన రాహుల్ గాంధీ

Congress leader Rahul Gandhi has been chosen for the first Oommen Chandy Public Servant Award


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఉమెన్ చాందీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన తొలి ‘ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’కు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఉమెన్ చాందీ ప్రథమ వర్ధంతి పూర్తయిన మూడు రోజుల అనంతరం ‘ఉమెన్ చాందీ ఫౌండేషన్’ ఈ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు కింద రూ.1 లక్ష నగదు, ప్రఖ్యాత కళాకారుడు, చిత్రనిర్మాత పుష్పరాజ్ రూపొందించిన శిల్పాన్ని అందజేయనున్నారు. 

కాగా రాహుల్ గాంధీ చాలా ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను విన్నారు. వాటికి పరిష్కారాల కోసం ప్రయత్నించారని, అందుకే ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల జ్యూరీ రాహుల్ గాంధీకి ఈ అవార్డును ఎంపిక చేసిందని ఒక ప్రకటనలో ‘ఉమెన్ చాందీ ఫౌండేషన్’ పేర్కొంది.

  • Loading...

More Telugu News