Jagan: ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించనున్న జగన్

Jagan will meet governor this evening

  • ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందంటున్న వైసీపీ
  • నేటి సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లనున్న జగన్
  • టీడీపీ పాలనపై గవర్నర్ కు వివరించనున్న వైసీపీ అధినేత

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లనున్న జగన్ గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. 

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని, హత్యలు, దాడి ఘటనలు, విధ్వంసాలు చోటుచేసుకుంటున్నాయని గవర్నర్ కు తెలుపనున్నారు. వినుకొండ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలను ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం వంటి ఘటనలపై గవర్నర్ కు సాక్ష్యాలను, వీడియోలను అందజేయనున్నారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.

Jagan
Governor
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News