Kedarnath: కొండచరియలు విరిగిపడడంతో కేదార్ నాథ్ యాత్రీకులు ముగ్గురు మృతి

3 Dead In Landslide In Kedarnath

-


కేదార్ నాథ్ యాత్రలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు యాత్రీకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఎనిమిది మంది యాత్రీకులు గాయపడ్డారు. గౌరీకుండ్, ఛిర్ బాసా మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, చనిపోయిన యాత్రీకులలో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ విచారం వ్యక్తంచేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Kedarnath
Devotees
Lanslide
Gowrikund
Rudraprayag
Uttarakhand
  • Loading...

More Telugu News