Mallikarjun Kharge: మీరు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి మోదీ బర్త్ డే విషెస్

AICC Chief Mallikarjun Kharge Celebrates 82nd Birthday Wishes Pours


కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు 82వ జన్మదినం జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి’’ అని ప్రధాని ఎక్స్ ద్వారా విషెస్ తెలిపారు. 

‘‘ఖర్గేజీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రజల కోసం అలుపెరగకుండా మీరు పనిచేస్తున్న తీరు, అంకితభావం స్ఫూర్తిదాయకం’’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, ప్రముఖులు ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

More Telugu News