Rishabh Pant: ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్‌తో భర్తీ చేయనున్న సీఎస్‌కే?

Pant to move from DC to CSK say sources

  • ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్‌కేకు మారనున్న పంత్
  • వచ్చే సీజన్‌లో ధోనీ ఆడకపోవచ్చన్న వార్తలు
  • తన టీంకు గుడ్‌బై చెప్పనున్న లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగడం సందేహంగా మారింది. ఈ ఏడాదే ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించొచ్చన్న అంచనాలు వెలువడినా, సీజన్ చివర్లో ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే, వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం అనుమానమేనని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ వచ్చే సీజన్‌కు సీఎస్‌కేకు మారనున్నట్టు సమాచారం. ధోనీ స్థానాన్ని పంత్‌తో భర్తీ చేయాలని సీఎస్‌కే చూస్తోందట. ధోనీ వచ్చే ఏడాది ఆడతాడో లేదో కానీ పంత్ మాత్రం ఢిల్లీని వీడి సీఎస్‌కేతో కలవడం ఖాయమని అంటున్నారు. మరోవైపు, లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ జట్టుకు గుడ్‌బై చెప్పి బెంగళూరులో చేరనున్నానడట. గత సీజన్లో లఖ్‌నవూ యజమాని, రాహుల్‌ను బహిరంగంగా తిడుతున్నట్టు కనిపించిన వీడియో దుమారం రేపిన విషయం తెలిసిందే.

Rishabh Pant
Chennai Super Kings
Delhi Capitals
IPL
  • Loading...

More Telugu News