Zadingi: గొడ్డలితో పులిని నరికి చంపిన మిజోరం వీరనారి జెడింగీ మృతి

Mizoram bids farewell to Zadingi who killed a tiger with an axe

  • వంట చెరకు కోసం వెళ్లిన జెడింగీపై పులి దాడి
  • చేతిలో ఉన్న చిన్న గొడ్డలితో పోరాడి నరికి చంపిన మహిళ
  • ‘శౌర్యచక్ర’ పురస్కారంతో గౌరవించిన ప్రభుత్వం
  • సుదీర్ఘకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూత

46 సంవత్సరాల క్రితం గొడ్డలితో పులిని చంపిన వీరనారి జెడింగీ (72) మరణించారు. సుదీర్ఘకాలంపాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆమె శుక్రవారం కన్నుమూశారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని లుంగ్‌లేయీ జిల్లా బవార్‌పుయీ గ్రామానికి చెందిన ఆమె 3 జులై 1978లో ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు. 

అప్పటికే అక్కడ పొంచివున్న పులి జెడింగీపై దాడిచేసింది. ఆమె ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న చిన్న గొడ్డలితో దానితో పోరాడింది. చివరికి దానిని నరికి చంపింది. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చిన ప్రభుత్వం 1980లో ‘శౌర్యచక్ర’ అవార్డుతో గౌరవించింది. ఆమె చంపిన పులి కళేబరాన్ని మమ్మీగా మార్చి మిజోరం రాష్ట్ర మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అది ఇప్పటికీ ఉంది. జెడింగీ సాహసగాథను రాష్ట్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు. జెడింగీకి మిజోరం ప్రజలు నిన్న ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి లాల్‌దుహోమా సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News