Express Trains: ప్రయాణికులకు శుభవార్త... నడికుడి, పిడుగురాళ్లలో ఆగనున్న నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లు

Three express trains will stop in Nadikudi and Piduguralla


ఇటీవల చెన్నై, విశాఖ, నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లకు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో స్టాపింగ్ ఎత్తివేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ ఆదేశాలను రైల్వే అధికారులు వెనక్కి తీసుకున్నారు. పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్లలో ఈ మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. 

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చొరవతో ఇది సాధ్యమైంది. నిన్నటి నుంచి నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ లకు స్టాపింగ్ తీసేశారు. దాంతో, ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన అధికారులు ఆ మూడు రైళ్లకు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో స్టాపింగ్ ఏర్పాటు చేశారు. 

కరోనా సంక్షోభం సమయంలో నారాయణాద్రి, చెన్నై, విశాఖ ఎక్స్ ప్రెస్ లను నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆపరాదని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ రైళ్లు అందుబాటులో లేకుండా పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

అప్పటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రైల్వే అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లగా... ఈ రెండు స్టేషన్లలో ఏడాది పాటు సదరు ఎక్స్ ప్రెస్ లను ఆపేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆ గడువు (జులై 19) నిన్నటితో ముగిసిపోయింది.

  • Loading...

More Telugu News