Kaleshwaram Project: గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయి: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ ట్వీట్

KTR tweet on kaleswaram project

  • కాళేశ్వరం సగర్వంగా తలెత్తుకొని సలాం చేస్తోందన్న కేటీఆర్
  • గంగా ప్రవాహంలో లక్షల కోట్ల వృథా ఆరోపణలు గల్లంతయ్యాయన్న కేటీఆర్
  • మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే మేటిగడ్డ అన్న మాజీ మంత్రి

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని... కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకొని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్న వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు.

పోటెత్తిన వరదకు దుష్టశక్తుల.. పన్నాగాలు పటాపంచలయ్యాయని...  కానీ.. కేసీఆర్ గారి సమున్నత సంకల్పం..
జై కొడుతోంది.. జల హారతి పడుతోందని ఆయన పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో.. లక్షకోట్లు వృథా చేశారనే విమర్శలు గల్లంతయ్యాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం.. మొక్కవోని దీక్షతో నిలబడింది.. కొండంత బలాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు.

ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు.. ఇప్పటికీ.. ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే 'మేటి'గడ్డ అని పేర్కొన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే 'కల్పతరువు' అన్నారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన.. ఈ మానవ నిర్మిత అద్భుతానికి, నిర్మించిన కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ అన్నారు. జై తెలంగాణ... జై కాళేశ్వరం అని ముగించారు.

Kaleshwaram Project
KTR
Telangana
  • Loading...

More Telugu News