Anna Konidela: సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా... హాజరైన పవన్ కల్యాణ్

Anna Konidela recieves masters degree from Singapore University

  • సింగపూర్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అన్నా లెజినోవా
  • సింగపూర్ లో జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించిన వైనం
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సింగపూర్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అన్నా లెజినోవా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. సింగపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలను పవన్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

More Telugu News