Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

Police case on actress Sri Reddy

  • చంద్రబాబు, పవన్, అనితలపై అనుచిత వ్యాఖ్యలు
  • కర్నూలు పోలీసులకు టీడీపీ నేత రాజు ఫిర్యాదు
  • శ్రీరెడ్డిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరిన రాజు

వివాదాస్పద సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసభ్య పదజాలంతో శ్రీరెడ్డి దూషించారంటూ పోలీసులకు టీడీపీ అధికార ప్రతినిధి (బీసీ సెల్) రాజు ఫిర్యాదు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా యూట్యూబ్, ఫేస్ బుక్ లో మాట్లాడిన శ్రీరెడ్డిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన కోరారు. శ్రీరెడ్డికి శిక్ష పడేలా చేయాలని విన్నవించారు. రాజు ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Sri Reddy
Tollywood
Case
  • Loading...

More Telugu News