Medaram: మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మృతి

Medaram priest Muthaiah dead

  • తెల్లవారుజామున పూజారి ముత్తయ్య మృతి
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ముత్తయ్య
  • ముత్తయ్య వయసు 50 ఏళ్లు

తెలంగాణలోని మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య ఈ ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ముత్తయ్య నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ముత్తయ్య మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. ముత్తయ్య మృతితో మేడారంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Medaram
Priest
Muthaiah
  • Loading...

More Telugu News