Boat Fire: బోటులో మంటలు.. 40 మంది హైతీ వలసదారుల సజీవ దహనం

Boat fire kills at least 40 Haitian migrants

  • హైతీలో పెచ్చుమీరుతున్న తీవ్రవాదం
  • హింస భరించలేక దేశాన్ని వీడుతున్న హైతీలు
  • ప్రమాద సమయంలో బోటులో దాదాపు 80 మంది 
  • 41 మందిని రక్షించిన హైతీ కోస్ట్‌గార్డ్

హైతీ నుంచి దాదాపు 80 మంది వలసదారులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. 41 మందిని హైతీ కోస్ట్‌గార్డ్ రక్షించింది. హైతీ నుంచి బయలుదేరిన ఈ బోటు టర్క్స్ అండ్ కాయ్‌కోస్ ఐలాండ్స్‌కు వెళ్తున్నట్టు గుర్తించినట్టు హైతీలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) తెలిపింది. 

ప్రయాణం క్షేమంగా సాగాలంటూ బోటులోని ప్రయాణికులు కొవ్వొత్తులు వెలగించి ప్రార్థించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా హైతీలో తీవ్రవాద ముఠాలు చెలరేగి మారణహోమం సృష్టిస్తుండడంతో హైతీలు అక్రమ మార్గాల ద్వారా వలసలు వెళ్తూ ఇలా ప్రమాదాల బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు.

Boat Fire
Haiti
Migrants
  • Loading...

More Telugu News