Dhoni - Rizwan: పాక్ జర్నలిస్టుపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం

Pak journalist comparing Dhoni rizwan angers harbhajan singh

  • ధోనీ, రిజ్వాన్‌లో మెరుగు ఎవరంటూ పాక్ జర్నలిస్టు నెట్టింట పోస్టు
  • ఇలాంటి ప్రశ్న అడిగిన విలేకరిపై హర్భజన్ సింగ్ గుస్సా
  • అనుభవం తక్కువగా ఉన్న ఆటగాడిని ధోనీతో పోల్చడం ఏమిటని ప్రశ్న

దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ఓ పాక్ జర్నలిస్టు తమ దేశ క్రీడాకారుడు మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చడంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీరిద్దరిలో గొప్ప ఆటగాడు ఎవరంటూ సదరు జర్నలిస్టు ధోనీ, రిజ్వాన్ ఫొటోలను షేర్ చేశాడు. దీనిపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కువ అనుభవం లేని ఆటగాడిని ధోనీతో పోల్చడం సరైంది కాదని విమర్శించాడు. రిజ్వాన్‌ బ్యాటింగ్‌ సత్తాను తక్కువ చేయనని, ధోనీతో సరితూగే ప్లేయర్ మాత్రం కాదని స్పష్టం చేశాడు. 

‘‘ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. రిజ్వాన్ కంటే ధోనీ చాలా ముందున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిజాయతీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్ ఆటను నేను కూడా ఇష్టపడతా. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే, ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం తప్పు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో అతడే నంబర్ వన్. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా వ్యవహరించిన వికెట్ కీపర్లు చాలా అరుదు. ఈ జాబితాలో ధోనీనే టాప్’’ అని  హర్భజన్ సింగ్ అన్నాడు. 

ధోనీ నాయకత్వంలో భారత్.. వన్డే టీ20 ప్రపంచకప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది వరకూ సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోనే సీఎస్‌కే ఐదు ట్రోఫీలు నెగ్గింది.

  • Loading...

More Telugu News