Chandrababu: నెల్లూరు రొట్టెల పండుగకు రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu issued Rs 5 crore to Nellore Roti Festival
  • ఈ నెల 17న ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగ
  • నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఘనంగా రొట్టెల పండుగ
  • భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు
ఏపీలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ప్రసిద్ధికెక్కిన నెల్లూరు రొట్టెల పండుగ ఈ నెల 17న ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఈ వేడుక ఐదు రోజుల పాటు జరగనుంది. మతాలకు అతీతంగా భక్తులు ఈ పండుగలో పాలుపంచుకుంటారు. కాగా, నెల్లూరు రొట్టెల పండుగకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.5 కోట్లు మంజూరు చేశారు. రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు రొట్టెల పండుగను 2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.
Chandrababu
Nellore Roti Festival
Nellore
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News