AP Rains: బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వర్ష సూచన

Low pressure area in Bay Of Bengal intensify into depression

  • వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
  • రేపు ఒడిశా తీరం దిశగా పయనం
  • ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఇది రేపు (జులై 20) ఉదయం వాయవ్య దిశగా పయనం ప్రారంభిస్తుందని, ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, నంద్యాల, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది. 

అదే సమయంలో... నెల్లూరు, పల్నాడు, కాకినాడ, కోనసీమ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, వైఎస్సార్ కడప, శ్రీ సత్యసాయి, ఉభయ గోదావరి, బాపట్ల, కోనసీమ, గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News