Ponguleti Srinivas Reddy: రైతు భరోసా ఏ మేరకు ఇవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Minister on Rythu Bharosa

  • రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసాపై నిర్ణయం ఉంటుందని వెల్లడి
  • అందుకే నేరుగా రైతుల వద్దకు వెళ్లి అభిప్రాయాలు తీసుకుంటున్నామని వ్యాఖ్య
  • రైతు భరోసాకు, రుణమాఫీకి తేడా తెలియదా? అని నిలదీత

రైతు భరోసా ఏ మేరకు ఇవ్వాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసాపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. అందుకే తాము నేరుగా రైతుల వద్దకు వెళ్లి అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు.

రైతు భరోసాకు కేటాయించిన నిధులను రుణమాఫీ కోసం ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని... వారికి రైతు భరోసా, రైతు రుణమాఫీకి తేడా తెలియదా? అని ప్రశ్నించారు. అలాంటి వారు పాలన ఎలా చేశారో చెప్పాలన్నారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రస్తావన తీసుకు వచ్చామన్నారు. కానీ రేషన్ కార్డు ఉన్నవాళ్లకే రుణమాఫీ ఇస్తారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రుణమాఫీపై ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.

రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కేటాయించాం: శ్రీధర్ బాబు

రైతు రుణమాఫీపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, కానీ గతంలో ఎప్పుడైనా మాట్లాడారా? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రైతులకు మంచి చేసేందుకు తాము ముందుకు వస్తే విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.31 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు ప్రస్తావించిన అంశాన్ని వ్యవసాయ అధికారులు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News