Ram Charan: రైమ్ తో కలిసి లండన్ లో రామ్ చరణ్ ఫొటో షూట్

Ram Charan and Rhyme set for a photo shoot in London

  • లండన్ ట్రిప్ వెళ్లిన రామ్ చరణ్
  • రామ్ చరణ్ తో కలిసి ఫొటో షూట్ కు ముస్తాబైన పెంపుడు శునకం రైమ్
  • అభిమానులను అలరిస్తున్న ఫొటోలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా లండన్ ట్రిప్ వెళ్లాడు. రామ్ చరణ్ తమతోపాటు పెంపుడు శునకం 'రైమ్' (పూడిల్స్ జాతి కుక్క)ను కూడా వెంట తీసుకెళ్లారు. తాజాగా, 'రైమ్' తో కలిసి రామ్ చరణ్ లండన్ లో ఫొటో షూట్ కు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ తన నేస్తం 'రైమ్' ను క్యూట్ గా ముస్తాబు చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఎక్కడికి వెళ్లినా తమ 'రైమ్' ను కూడా వెంటబెట్టుకుని వెళుతుంటారు. ముద్దుల తనయ క్లీంకార ఒకరి చేతుల్లో ఉంటే, రైమ్ మరొకరి చేతుల్లో ఉండడం అనేక పర్యాయాలు ఎయిర్ పోర్టుల్లో కనిపించింది. 

రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Ram Charan
Rhyme
Photo Shoot
London
Upasana
Game Changer
  • Loading...

More Telugu News