Madan-Shanti: డీఎన్ఏ టెస్టులో ఏమీ లేదని తేలితే విజయసాయిరెడ్డికి సాష్టాంగ నమస్కారం చేస్తా: మదన్ మోహన్

Madan Mohan another press meet

  • తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రెవరో తేలాలంటున్న మదన్
  • విజయసాయి ముందుకొచ్చి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని సూచన
  • బాబుకు తండ్రెవరో తేలితేనే తనకు, శాంతికి రిలీఫ్ అని వెల్లడి 

తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రెవరో తేలాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మదన్ మోహన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. శాంతి చెప్పిన వివరాల మేరకే తాను విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశానని, ఆయన కూడా ముందుకు వచ్చి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని మదన్ కోరారు. 

"నేను కోరుకునేది ఒక్కటే... ఆ బిడ్డకు తండ్రెవరో డీఎన్ఏ టెస్టు ద్వారా తేల్చాలి. నేను ఎవరి పేర్లయితే తెరపైకి తెచ్చానో వారిని కోర్టు ద్వారా పిలిపించి డీఎన్ఏ టెస్టు చేయించాలి. బాబుకు తండ్రెవరో తేలితే నాకు రిలీఫ్, శాంతికి రిలీఫ్. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతోంది ఇద్దరమే... నేను, శాంతి. ఇద్దరం రోడ్డుమీదికి వచ్చాం! సమస్య పెద్దదవుతోంది! 

ఇంత భయంకరమైన గొడవ జరుగుతుంటే పోతిరెడ్డి సుభాష్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాడో అర్థం కావడంలేదు. మీడియా కూడా ఒత్తిడి తీసుకురావాలి. అతడెందుకు అజ్ఞాతంలోకి వెళ్లాడు? దాని వెనుక ఏమైనా అజెండా ఉందా? ఇంకా ఏమైనా కుట్రలు ఉన్నాయా? సుభాష్ తన భర్త అని శాంతి చెబుతున్నప్పుడు... అతడు కూడా ముందుకు వచ్చి తన వాదన వినిపించాలి కదా. అతడికి కూడా ఇప్పటికే పెళ్లయింది... భార్య ఉంది, 9వ తరగతి చదివే కూతురు ఉంది. హైదరాబాదులోనే రవీంద్రభారతి సమీపంలో ఉంటారు.

ఇక, విజయసాయిరెడ్డి నా తండ్రి వంటివారు. ఆయన ముందుకు వచ్చి డీఎన్ఏ టెస్టు చేయించుకుని తన నిజాయతీని నిరూపించుకోవడంలో ఏ తప్పు లేదు. డీఎన్ఏ టెస్టులో ఏమీ లేకపోతే నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. 

ఇప్పటివరకు నేను శాంతితో విడాకులు తీసుకోలేదు. మేం 2016లోనే విడాకులు తీసుకున్నట్టు శాంతి చూపిస్తున్న డాక్యుమెంట్ ఒరిజినల్ కాదు. అందువల్ల, ఆ బిడ్డకు తండ్రెవరో తేలితేనే భవిష్యత్తులో నాకు సమస్యలు రాకుండా ఉంటాయి" అని మదన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News