Ramcharan: రామ్ చరణ్ కు మరో అంతర్జాతీయ గౌరవం

Ram Charan Becomes First Indian Celeb To Be Awarded Ambassador For Indian Art and Culture

  • ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు గౌరవ అతిథిగా చరణ్
  • ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్న చరణ్
  • మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషాన్ని ఇస్తుందని వ్యాఖ్య

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్... తమ 15వ ఎడిషన్ వేడుకలకు చరణ్ ను గౌరవ అతిథిగా ఆహ్వానించింది. ఈ సంస్థ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 నుంచి 25 వరకు జరుపుతున్న వేడుకలకు చరణ్ ను ఆహ్వానించింది. 

ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ టీమ్ మాట్లాడుతూ... తమ 15వ ఎడిషన్ కార్యక్రమానికి చరణ్ హాజరు కానుండటం తమకు మరుపురాని అంశంగా మిగిలిపోతుందని తెలిపింది. వేడుకల్లో చరణ్ నటించిన ప్రముఖ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నామని వెల్లడించింది. భారతీయ సినిమాకు చరణ్ చేసిన సేవలకు గాను... 'భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్' బిరుదును కూడా ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. 

తనకు గౌరవ అతిథిగా ఆహ్వానం అందడంపై చరణ్ స్పందిస్తూ... ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో భాగం కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ప్రపంచ వ్యాప్త సినీ ప్రముఖులు, అభిమానులతో కనెక్ట్ కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు, ప్రేమ దక్కడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

  • Loading...

More Telugu News