Vijayasai Reddy: 'మహాన్యూస్' వంశీకృష్ణకు లీగల్ నోటీసులు పంపిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy sent legal notice to Mahaa News Vamsi Krishna

  • ఇటీవల విజయసాయిరెడ్డిపై మీడియాలో కథనాలు
  • కొన్ని చానళ్లపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న విజయసాయి
  • 'మహాన్యూస్' వంశీ కృష్ణ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఇటీవల తనపై కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా చానళ్లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇవాళ మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణకు లీగల్ నోటీసులు పంపానని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

తప్పుడు ఉద్దేశాలతో, నిరాధార వార్తలు ప్రసారం చేశారని, తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. వంశీ కృష్ణ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

అతడు చేసిన ఘోరాతి ఘోరమైన తప్పిదానికి క్షమాపణలు చెప్పకపోతే, అందుబాటులో ఉన్న తదుపరి చట్టబద్ధ మార్గాలను తాను ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

More Telugu News