Vangalapudi Anitha: వైసీపీ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది చంద్రబాబు, పవన్ కల్యాణ్: అనిత

Chandrababu and Pawan Kalyan suffered a lot during YSRCP ruling says Anitha

  • వైసీపీ రెచ్చగొట్టినా ఎవరూ రెచ్చిపోవద్దన్న అనిత
  • అరాచక శక్తులను చట్టపరంగానే అణచివేస్తామని వ్యాఖ్య
  • చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలకు భరోసా అన్న హోం మంత్రి

జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాకుండా సామన్య ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరి కంటే ఎక్కువ ఇబ్బంది పడ్డారని తెలిపారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని... సంయమనం కోల్పోకుండా జగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టినా ఎవరూ రెచ్చిపోవద్దని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. 

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవరూ చేయొద్దని అనిత చెప్పారు. అరాచక శక్తులను చట్టపరంగానే అణచివేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని... దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు కూడా గత ప్రభుత్వ విధ్వంసం తాలూకా అవశేషాలేనని అన్నారు. శాంతిభద్రతలను సరిదిద్దేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలకు భరోసా అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి జగన్ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. చిన్నాన్న వివేకా హత్య, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం వంటి వాటిపై జగన్ లేఖ రాస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News